నేను స్టార్‌గా ఎదిగింది తెలుగులోనే – కమల్ హాసన్

Kamal Haasan Reveals Interesting Facts About Thug Life

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ సంస్థ ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాను కూడా భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఒక దర్శకుడిగా మణిరత్నం గారు నాయకుడు సినిమాతో ఎలా అయితే అందరినీ సర్ప్రైజ్ చేశారో.. థగ్ లైఫ్ తో కూడ ఆయన ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నారు. నన్ను ద్రోణాచార్యతో పోల్చారు. కానీ నేను ద్రోణాచార్యుని కాదు. నేను ఇంకా విద్యార్థినే. ఒకరికి నేర్పాలంటే మన ముందు నేర్చుకోవాలి. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి నేర్చుకోండి.”

“నేను మణిరత్నం గారి సినిమాలో యాక్ట్ చేయను, జస్ట్ బిహేవ్ చేస్తాను. మేమంతా సినిమా అభిమానులం. సినిమాని ఎప్పుడు కూడా భుజాలపై మోస్తాం. నాజర్ గారు ఆల్రౌండర్. మేము ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నాం. ఇంద్రుడు చంద్రుడు సినిమాకి తనికెళ్ల భరణి గారు రాయాల్సింది. కానీ అది కుదరలేదు. ఆయనతో కలిసి మరింత ప్రయాణం చేయాలని ఉంది. ఆయన ఇంకా ఎక్కువ రాయాలని కోరుకుంటున్నాను.”

“శింబు చైల్డ్ హుడ్ నుంచి నేను తన సినిమాలు చూస్తూ ఉన్నాను. నేను కూడా చైల్డ్ యాక్టర్ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను. అందుకే మేము ఎంతో కనెక్ట్ అయ్యాం. ఏదైనా సినిమానే మాకు నేర్పింది. నేను అందుకే ఒక సినిమా విద్యార్థిగానే నన్ను నేను చెప్పుకుంటాను. నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. థగ్ లైఫ్ మనసుపెట్టి చేసిన సినిమా. అభిరామి మళ్ళీ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది.”

“ఇది ఒక ఫెంటాస్టిక్స్ టీం తో చేసిన సినిమా. గొప్పగా సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమా నాయకుడు కంటే పెద్ద విజయం సాధిస్తుంది. ఇది నా ప్రామిస్. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ అప్పటినుంచి చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది.”

“నేను తెలుగులోనే స్టార్ గా ఎదిగాను. స్టార్ గా నేను పుట్టిన ఇల్లు తెలుగు. అందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే నా శక్తి వంచన లేకుండా ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. జూన్ 5న సినిమా వస్తోంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.