ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ సంస్థ ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాను కూడా భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కమల్ హాసన్ గారితో నాయకుడు సినిమా చేశాను. ఆయనతో ఫస్ట్ టైం కలిసి నాయకుడు సినిమా చేశాను. మౌనరాగం సినిమా పూర్తయిన తర్వాత ఇంట్లో కూర్చుని ఉన్నాను. నిర్మాత ముక్తా శ్రీనివాసన్ గారు వచ్చి ఒక క్యాసెట్ చేతిలో పెట్టారు. అది ఒక హిందీ సినిమా. ఆ సినిమాని తమిళంలో చేయాలని చెప్పారు. నాకు రీమేక్ చేసే ఉద్దేశం లేదు. అయితే ఇదే మాట కమల్ హాసన్ గారితో చెప్పమన్నారు. నేను వెళ్లి ఆయనకు అదే చెప్పాను.”
“అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ సినిమా చేద్దామని చెప్పారు. అలా నాయకుడు సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అలానే జరిగింది. కాల్ చేసి ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని చెప్పారు. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది. ఆయనతో ఇన్నేళ్ల తర్వాత సెకండ్ సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయనతో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ఆయన నాయకుడు సినిమా సమయంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నేను డైరెక్టర్ కాకముందు నుంచి ఆయన్ని చూస్తున్నాను. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన దర్శకుడు ఏమనుకుంటున్నాడో దాన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే హీరో” అని ప్రశంసించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























