తమిళ హీరో ధనుష్ లైనప్ చూస్తే షాక్ అవ్వాలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 సినిమాలు లైన్లో వున్నాయి.దాంతో సౌత్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత బిజీగా యాక్టర్ గా మారిపోయాడు.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో చూస్తే ప్రస్తుతం ధనుష్ తెలుగులో కుబేర చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే .జూన్ 20 న రిలీజ్ చేయనున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే తమిళంలో ధనుష్ రీసెంట్ గా ఇడ్లీ కడాయి కంప్లీట్ చేశాడు.ఈసినిమాలో నటించడమే కాదు తనే డైరెక్ట్ చేస్తున్నాడు. అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.ధనుష్ సరసన నిత్య మీనన్ నటించగా అరుణ్ విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ధనుషే ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక ధనుష్ హిందీలో ప్రస్తుతం ఇష్క్ తేరా మే లో నటిస్తున్నాడు.ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తుండగా కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇవి కాకుండా ధనుష్ తమిళంలో ఇళయరాజా బయోపిక్ చేయనున్నాడు.అలాగే రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తన 55వ సినిమా ఓకే చేశాడు.ఈరెండు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్నాయి.వీటితోపాటు మరి సెల్వరాజ్ తో తన 56వ సినిమా ను విగ్నేష్ రాజా డైరెక్షన్ లో ఓ సినిమాను వెట్రి మారన్ డైరెక్షన్ లో ఓ సినిమాను ఒప్పుకున్నాడు. రీసెంట్ గా లబ్బర్ పందు డైరెక్టర్ తో కూడా ఓ ప్రాజెక్టు కు సైన్ చేశాడు.
ఇక ధనుష్ నిన్న ఇంకో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు.ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో భారత మాజీ రాష్ట్రపతి , శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ చేయనున్నాడు.దీనికి టైటిల్ కలాం అని ఖరారు చేశారు.పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ఇవే కాకుండా హెచ్ వినోత్ , మహారాజ ఫేమ్ నిథిలన్ లతో సినిమాలు చర్చల దశలో వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: