‘2018, మారి, లూసిఫర్’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన మలయాళ హీరో టోవినో థామస్. ఇవే కాకుండా ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో ఓటీటీలలో చూసే ప్రేక్షకులూ ఎక్కువే. తాజాగా టోవినో థామస్ ప్రధానపాత్రలో నటించిన మూవీ ‘నరివెట్ట’. ‘తోడేలు వేట’ అనేది ట్యాగ్ లైన్. పోలీస్ ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో ప్రముఖ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. చేరన్ పాండ్యన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రం మే 23న థియేటర్లలోకి వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే టోవినో థామస్‌కి ఇక్కడ కొంచెం గుర్తింపు ఉండటంతో దీనిని క్యాష్ చేసుకునేందుకు డైరెక్ట్‌గా థియేటర్లలోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ దక్కించుకుంది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 23న నరివెట్ట చిత్రాన్ని ఈ సంస్థ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























