భోళా శంకర్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభరతో రానున్నాడు.నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు మేకర్స్.ఇక ఈసినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.ఇందులో చిరు సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా యువ హీరోయిన్లు ఆషికా రంగనాథ్ ,సురభి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆషికా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈసినిమా గురించి స్పందించింది.ఇందులో యోధురాలు అయిన యువరాణి పాత్రలో నటిస్తున్నాను.నా కెరీర్ లో బ్లూ , గ్రీన్ మ్యాట్ మధ్య షూట్ చేయడం ఇదే మొదటి సారి.దాంతో కొంచెం కష్టంగా అనిపించింది. అయితే చిరంజీవి గారి గైడెన్స్ వల్ల కంఫర్టబుల్ గా చేశాను అంటూ చెప్పుకొచ్చింది.
బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈసినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.
ఇక చిరంజీవి ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టె పనిలో వున్నాడు.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చిరు 157 సినిమా చేయనున్నాడని తెలిసిందే.అతి త్వరలో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇందులో నయనతార హీరోయిన్ గా నటించనుండగా షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి.వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























