యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ లోని మ్యూజికల్ యూనివర్స్ మరింత స్వీట్‌గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ‘షుగర్ బేబీ’ రిలీజ్ అయ్యింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్లిజీ చార్మ్ తో పాటు, అదిరిపోయే వైబ్‌తో ఈ పాట, రిథమ్, అటిట్యూడ్ బ్లెండ్‌తో ఓ బోల్డ్ కాక్‌టెయిల్‌లా ఆకట్టుకుంటోంది. రెహమాన్ సంగీతం మ్యాజికల్‌గా వుంది. సాఫ్ట్, మెలోడిక్ బీట్స్ కట్టిపడేసింది. అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ వోకల్స్‌తో సాంగ్‌ని మరింత లైవ్లీగా మార్చారు. ఒక్కో సింగర్ వారి స్వంత వాయిస్ టెక్స్చర్‌తో పాటకు ప్రత్యేక ఫ్లేవర్‌ను ఇచ్చారు.
ఆనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం అదిరిపోయింది. లిరిక్స్ మనసులో నిలిచిపోయేలా వున్నాయి. త్రిషా కృష్ణన్ మెస్మరైజింగ్ బ్యూటీతో కనువిందు చేసింది. ఆమె లుక్స్, గ్రేస్, అన్నీ కలసి తెరపై మ్యాజిక్‌ని సృష్టించాయి. రవికే చంద్రన్ అందించిన విజువల్ ఎస్తెటిక్ టచ్‌తో ప్రతి ఫ్రేమ్ విజువల్ ట్రీట్‌గా కనిపిస్తోంది.
రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, శ్రేష్ట్ మూవీస్ అధినేత ఎన్. సుధాకర్ రెడ్డి గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























