విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే కన్నప్ప నుండి టీజర్ మరియు మూడు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. జూన్ 27న కన్నప్ప రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నేడు మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అలాగే సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టింది.
అందులో.. “లెజెండరీ ఐకాన్, పద్మభూషణ్ శ్రీ మోహన్ లాల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! కన్నప్ప అనే ఇతిహాస గాథలో కిరాత పాత్రను ఆయన పోషించడం దైవిక బలం మరియు సినిమాటిక్ ప్రతిభ యొక్క శక్తివంతమైన సమ్మేళనంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. తరతరాలుగా మరపురాని ప్రదర్శనల నుండి భయంకరమైన యోధుడి పాత్రలోకి అడుగుపెట్టడం వరకు, లాలెట్టన్ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు.” అని పేర్కొంది.
కాగా కన్నప్ప చిత్రంలో ప్రీతి ముఖుంధన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వీరితోపాటుగా విష్ణు మంచు కుమార్తెలు, కుమారుడు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూరుస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: