తమిళ హీరో శివ కార్తికేయన్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి.రీసెంట్ గా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మురగదాస్ ఈసినిమాను గజినీ ,తుపాకి టైప్ లో తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీలంక లో చివరి షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో శివ కార్తికేయన్ ,విద్యుత్ జమ్వాల్ లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అమరన్ తరువాత శివ కార్తికేయన్ నుండి వస్తున్న సినిమా కావడంతో మదరాసి పై భారీ అంచనాలు వున్నాయి.
ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం ఈ సినిమాతోపాటు తన 25వ సినిమా పరాశక్తి లో కూడా నటిస్తున్నాడు.40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ ,శ్రీలీల కీలకపాత్రల్లో నటిస్తున్నారు.జయం రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: