కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాధా కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే ఈ సినిమాతో జెనీలియా మళ్లీ రీఎంట్రీ ఇస్తుండగా.. కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 18న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తాజాగా ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా హీరో కిరీటి రెడ్డి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నా తొలి సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ గారు. లెజెండ్రీ డిఓపి సెంథిల్ గారు నిర్మాత సాయి గారు ఇలా అద్భుతమైన టీం తో కలిసి పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. లెజెండరీ యాక్టర్ వి రవిచంద్రన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.”
“ఆయన గురించి మాట్లాడే అంత అనుభవం నాకు లేదు. ఆయనతో కలిసి పనిచేయడం ఒక గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. శ్రీ లీల, జెనీలియా గారు ఈ సినిమాలో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన తెలుగు మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కాస్త ఆలస్యమైంది దానికి కారణం నాకు షూటింగ్లో జరిగిన ఒక గాయం. దాన్నుంచి కోల్పోవడానికి దాదాపు ఒక ఏడాది పట్టింది.”
“నా ఆరాధ్య దైవం పునీత్ రాజ్ కుమార్ గారు. రేపు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్ డే. ఎన్టీఆర్ గారికి ఒక అభిమానిగా హ్యాపీ బర్త్ డే. ఆయన మాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేశాను. చాలా మంచి సినిమా తీశాం. దేవిశ్రీ గారు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























