నార్నె నితిన్ ,నయన్ సారిక జంటగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఆయ్. గత ఏడాది థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది.అంజి ఈసినిమాను డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ 2 నిర్మించింది.ఇక ఈసినిమా తరువాత డైరెక్టర్ అంజి నెక్స్ట్ సినిమా ఓకే అయ్యింది.తన నెక్స్ట్ సినిమాను కూడా గీతా ఆర్ట్స్ లోనే చేయనున్నాడు.ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు కి కథ చెప్పి ఒప్పించాడు.దాంతో శ్రీ విష్ణు తో సినిమా చేయనున్నాడు అంజి.ఇది కూడా కామెడీ డ్రామాగానే రానుంది. ఇక శ్రీ విష్ణు కూడా గీతా ఆర్ట్స్ మరో రెండు సినిమాలు చేయాల్సివుంది.అందులో ఇప్పుడు ఓ సినిమాను అంజి తో చేస్తున్నాడు. త్వరలోనే ఈసినిమా గురించి ఆఫీషియల్ అప్డేట్ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా సింగిల్ తో వచ్చి మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు శ్రీ విష్ణు.ప్రస్తుతం ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో వుంది. ఈవారాంతం లోపు 30కోట్ల మార్క్ ను దాటనుంది.కార్తీక్ రాజు ఈసినిమాను డైరెక్ట్ చేయగా కేతిక శర్మ ,ఇవానా కథానాయికలుగా నటించారు.గీతా ఆర్ట్స్ ,కళ్యా ఫిలిమ్స్ నిర్మించింది.
ఇక శ్రీ విష్ణు చేతిలో అంజితో చేయనున్న సినిమా కాకుండా మరో నాలుగు సినిమాలు వున్నాయి. ఇందులో ఓ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.సో వరుస సినిమాలతో వచ్చే ఏడాది వరకు శ్రీ విష్ణు ఫుల్ బిజీ కానున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: