రీసెంట్ గా తండేల్ తో ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా తరువాత ప్రస్తుతం నాగ చైతన్య తన 24వ సినిమా చేస్తున్నాడు.విరూపాక్షతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన గుహ సెట్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది.చాలా సహజంగా ఈ సెట్ ను వేశారు ఆర్ట్ డైరెక్టర్.ప్రస్తుతం ఇందులోనే షూటింగ్ జరుగుతుంది.సినిమాలో ఈ గుహకు సంబంధించిన సన్నివేశాలు 20 నిమిషాల సేపు వుండనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిస్టరీ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇందులో తన రోల్ రివీలైంది.దక్ష అనే పాత్రలో మీనాక్షి ఆర్కియాలజిస్ట్ గా కనిపించనుంది.ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.భారీ విఎఫ్ఎక్స్ తో రానుంది ఈసినిమా.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చైతన్య కెరీర్ కు ఈసినిమా టర్నింగ్ పాయింట్ కానుంది.త్వరలోనే టైటిల్ చెప్పనున్నారు.అయితే టైటిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో లీకైంది.విరూపాక్షలాగే ఈసినిమా కూడా వి అనే ఇంగ్లీష్ అక్షరంతో స్టార్ట్ కానుంది.మరి ఈ వి సెంటిమెంట్ కలిసొస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: