నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గత నెలలో రిలీజై డీసెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఓపెనింగ్స్ ను అయితే రాబట్టగలిగింది కానీ తరువాత అదే రన్ ను కంటిన్యూ చేయకలేకపోయింది.ఇక ఈసినిమా ఓటిటి లోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో ప్రముఖ నటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ రోల్ లో నటించింది.సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ తరువాత విజయశాంతికి ఇది రెండో సినిమా. ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.సోహైల్ ఖాన్ విలన్ గా పాత్రలో కనిపించగా శ్రీకాంత్,యానిమల్ పృథ్వీ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు ఈసినిమాను నిర్మించారు.
ఇక కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు.నిర్మాత గా మాత్రం మైత్రి మూవీ మేకర్స్ తో కలిపి ఎన్టీఆర్ నీల్ నిర్మిస్తున్నాడు.అలాగే నెక్స్ట్ తన బ్యానర్ నుండి దేవర 2 కూడా రానుంది.అయితే హీరోగా కళ్యాణ్ రామ్ బింబిసార 2 చేయాల్సి వుంది.మరి నెక్స్ట్ కళ్యాణ్ రామ్ ఈసినిమానే చేస్తాడో లేదంటే మరో సినిమా ఏదైనా చేశాక ఈ సీక్వెల్ ను మొదలుపెడతాడో త్వరలోనే క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: