కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ #సింగిల్. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో మూవీ టీం అంతా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిత్ర విశేషాలను మరియు నటీనటుల, టెక్నిషియన్ల పనితీరును మెచ్చుకున్నారు.
అల్లు అరవింద్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఈ సినిమా రసెస్ చూసిన తర్వాత శ్రీవిష్ణుని పిలిచి గీత ఆర్ట్స్ లో మరో రెండు సినిమాలు చేయాలని చెక్ ఇచ్చాను. మనిషిగా యాక్టర్ గా తను అంత నచ్చాడు. సినిమా బాగుంటే మేము థియేటర్స్ కి వస్తాము అని నిరూపించిన ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డైరెక్టర్ కార్తీక్ రాజు అద్భుతంగా ఈ సినిమాని తీశారు.”
“విష్ణుతో నా ప్రయాణం ఇంకా ముందు ముందు ఉంటుంది. తను డైలాగ్ డైలాగ్ కి మధ్య చెప్పిన డైలాగు అర్థం చేసుకోవడం నావల్ల కాలేదు( నవ్వుతూ) వెన్నెల కిషోర్ ఈ సినిమాతో కొంచెం దగ్గర అయ్యారు. వ్యక్తిగత సలహాలు తీసుకోవడం దగ్గర వరకు వచ్చింది. కేతిక ఇవాన ఫెంటాస్టిక్ గా పెర్ఫాం చేశారు. విశాల్ చంద్రశేఖర్ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా ఎంగేజింగ్ గా చేశారు.”
“యువ దర్శకులంతా వచ్చి ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారందరికీ థాంక్యూ. విద్య మా అమ్మాయి. తను ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్స్ కి నటీనటులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సమ్మర్లో థియేటర్స్ కి వచ్చి అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: