పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూనే.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘ఓజీ’ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ దాస్ త్వరలో షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఈ మేరకు ఆయన తాజాగా ఎక్స్‌లో పవర్ స్టార్ స్టైలిష్ వీడియో ద్వారా వెల్లడించడం విశేషం. కాగా ఇప్పటికే అర్జున్ దాస్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అర్జున్ దాస్ మెడపై కండువాతో మాంచి ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో పురాతన కాలంనాటి ఒక భవంతి ఒకవైపు, దానిని దహించడానికి సిద్ధంగా ఉన్న ఫైర్ మరోవైపు.. ఇలా ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
కాగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ‘ఓజీ’ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ‘ఓజీ’ సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందో ఈ గ్లింప్స్ తో అందరికీ అర్ధమైంది. ఒక మూవీ గ్లింప్స్ గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడం ఈ మధ్యకాలంలో ఇదే కావడం గమనార్హం. అందులో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ హైలైట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ రూత్ లెస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వగా.. తమన్ తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నెక్స్ట్ లెవెల్‍కు తీసుకెళ్లాడు.
కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: