బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. భైరవం ఈ సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అదితి శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
- నేను తమిళ్‌లో చేసిన తొలి సినిమాని డైరెక్టర్ విజయ్ గారు చూశారు.
- భైరవంలో క్యారెక్టర్‌కు నేనైతే యాప్ట్‌గా ఉంటుందని భావించారు.
- ఆయన కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం జరిగింది.
ఇది మీ ఫస్ట్ తెలుగు సినిమా కదా.. ఎలాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారు?
- లాంగ్వేజ్ పరంగా ఒక బ్యారియర్ ఉంటుందని ముందుగా భావించాను.
- అయితే మా డైరెక్టర్, రైటర్ సత్య చాలా హెల్ప్ చేశారు.
- వారి హెల్ప్‌తో ఈ జర్నీ చాలా స్మూత్‌గా జరిగింది.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
- ఇందులో బోల్డ్ అండ్ హానెస్ట్, అదే సమయంలో బబ్లీగా ఉండే క్యారెక్టర్‌లో కనిపిస్తాను.
- ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్‌కి దగ్గరగానే ఉంటుంది.
- మా నాన్నగారితో కలిసి రామోజీ ఫిలిం సిటీ, తెలుగు రాష్ట్రాల్లో షూటింగులకి వచ్చేదాన్ని.
- ఇప్పుడు నా సొంత సినిమాకి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం ఒక డ్రీం కం ట్రూ మూమెంట్.
- నాకు తెలుగులో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది.
- ఇలాంటి మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు రావడం చాలా ఆనందం ఇచ్చింది.
మీరు ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతారు?
- కథ, అందులో నా క్యారెక్టర్ బాగుంటే కచ్చితంగా చేస్తాను.
మీ నాన్నగారు ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ గారు కదా.. మీరు ఒక హీరోయిన్‌గా మిమ్మల్ని నిరూపించుకోవడానికి ఎలాంటి ఛాలెంజ్ ఎదుర్కొంటారు?
- రియల్లీ ఇది నైస్ ఛాలెంజ్.
- నాన్నగారి ఇమేజ్‌ని ఒక గౌరవంగానే భావిస్తాను కానీ అది ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను.
ఇది మల్టీ స్టార్ సినిమా కదా.. ముగ్గురు హీరోలతో మీ జర్నీ ఎలా ఉండేది?
- ఇది రియల్లీ వెరీ ఫన్ ఎక్స్‌పీరియెన్స్. మనోజ్ గారు నాకు తెలుసు.
- ఆయన నన్ను సెట్‌లో చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగారు.
- తర్వాత ఈ సినిమాలోని నటిస్తున్నానని చెప్పాను. అది రియల్లీ ఫన్ మూమెంట్.
- సాంగ్ షూట్ సమయంలో ఫస్ట్ టైం సాయి గారిని కలిసాను. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్.
- రోహిత్ గారు కూడా చాలా నైస్ పర్సన్. ఈ ముగ్గురికి తమిళ్ మాట్లాడడం తెలుసు.
- సో ఈ జర్నీ చాలా కంఫర్ట్‌బుల్‌గా జరిగింది. ముగ్గురు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.
మ్యూజిక్ గురించి?
- శ్రీ చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
- ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌కి అద్భుతంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
- అలాగే మరో పాట కూడా రాబోతుంది. ఆ పాట కూడా చాలా వండర్‌ఫుల్‌గా ఉండబోతుంది.
- నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. ఇందులో రెండు డాన్సింగ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ రెండు కూడా నాకు వెరీ ఫేవరెట్.
మీరు తెలుగు సినిమాలు చూస్తుంటారా? మీ ఫేవరేట్ మూవీ?
- చూస్తాను. నా ఫేవరెట్ మూవీ మగధీర.
- ఎందుకంటే నేను ఫస్ట్ థియేటర్‌లో చూసిన తెలుగు సినిమా అది.
- అలా రాజమౌళి గారికి, రామ్ చరణ్ గారికి నేను బిగ్ ఫ్యాన్‌గా మారిపోయాను.
మీ నాన్నగారు మీరు చేస్తున్న కథలు వింటారా?
- లేదండి. మా నాన్నగారికి నేను చేస్తున్న సినిమాలు, వాటికి సంబంధించిన కథలు ఏమీ తెలియదు.
- మా అమ్మగారికి ప్రతిదీ చెప్తుంటాను. మా నాన్నగారు ఆయన సినిమాలతో ఆయన బిజీగా ఉంటారు.
- అలాగే ఆయన సినిమాలకు సంబంధించిన విశేషాలు కూడా ఏమి చెప్పరు.
- ఆయన సినిమాని ఒక పసిపాప లాగా జాగ్రత్తగా చూసుకుంటారు.
మీ నాన్నగారు మీ సినిమాలు చూస్తారా?
- ఆయనకి మరో ఆప్షన్ లేదు.
- ఆయన నా సినిమాలు చూడకపోతే ఆయనతో ఫైట్ చేస్తాను (నవ్వుతూ).
నిర్మాత గురించి?
- రాధమోహన్ గారు ప్రతిరోజు సెట్‌కి వచ్చేవారు.
- తన షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేసేవారు.
- ఆయన చాలా నైస్ పర్శన్.
డైరెక్టర్ విజయ్ కనకమేడల గురించి?
- ఆయన చాలా మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్. సెట్‌లో చాలా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు.
- ఆయనకి ఆర్టిస్టుల నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలో తెలుసు. ఆయన క్లారిటీ విజన్ ఉన్న డైరెక్టర్.
మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
- నాకు హిస్టారికల్, పిరియాడిక్ సినిమాలు చేయాలని ఉంది.
- అలాగే ఛాలెంజింగ్ విమెన్ క్యారెక్టర్స్ చేయాలని వుంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: