గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. దాంతో అంచనాలు భారీగా వున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పటివరకు పెద్ది 30శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రేపటి నుండి కర్ణాటక లోని ఖానాపూర్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాదాపు 9రోజుల పాటు జరుగనున్న ఈ నైట్ షూట్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ లండన్ లో ఉండడంతో రెండు రోజుల తరువాత ఈ షెడ్యూల్ లో జాయిన్ కానున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈసినిమాను పూర్తి చేసి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాను సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడు.వీరిద్దరి కాంబో లో ఇది రెండో సినిమా.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఈఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: