లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ సృష్టించాడు యంగ్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.ఇక ఈ హీరో రీసెంట్ గా డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.తెలుగులో ఈసినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. అంతేకాదు డ్రాగన్ తో వరుసగా రెండో సారి 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు క్రియేట్ చేశాడు ప్రదీప్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రదీప్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి.అందులో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) తన మూడో సినిమాగా వస్తుంది.విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలచేయాలని చూస్తున్నారు.సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈసినిమాను నిర్మిస్తుంది.ఇక ఈసినిమా పూర్తి కాకముందే ప్రదీప్ రీసెంట్ గా నాలుగో సినిమాను కూడా మొదలుపెట్టాడు.
కీర్తిశ్వరన్ అనే కొత్త దర్శకుడు ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇది రెండో సినిమా.ఇక ఈరోజు ఈసినిమా టైటిల్ ,ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం తోపాటు రిలీజ్ ఎప్పుడనేది కూడా చెప్పేశారు.ఈసినిమాకు డూడ్ అనే టైటిల్ ను ఖరారు చేయగా దీపావళికి తమిళంతోపాటు తెలుగు ,కన్నడ , హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: