కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. అందాల భామలు కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ నిన్న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హీరో, హీరోయిన్స్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.
ఈ సందర్భంగా హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ.. “ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్యూ. గీత ఆర్ట్స్ లో పనిచేయాలని డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరింది. నా కెరీర్లో ఇది హ్యుజ్ హిట్. విష్ణు గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ కార్తీక్ రాజు గారికి థాంక్యూ. ఇవానా పాటు ఈ సినిమా లో పనిచేసిన అందరికీ థాంక్యూ సో మచ్” అని చెప్పారు.
ఇక మరో హీరోయిన్ ఇవానా మాట్లాడుతూ.. “ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. గీత ఆర్ట్స్ లో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. హరిణి పాత్రని ఆడియన్స్ చాలా ఇష్టపడుతున్నారు. ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ. సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: