నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్ ఇండియా వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా మనకోసం వీరోచితంగా పోరాడుతున్న మన సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. సినిమా విషయానికి వస్తే.. మొదటి నుంచి ఈ సినిమాకి సపోర్ట్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్లిన మీడియాకి థాంక్యూ. మంచి కంటెంట్ ని ఆదరిస్తారని ఆడియన్స్ మరొకసారి ప్రూవ్ చేశారు. జనాలు థియేటర్స్ కి రాని సమయంలో ఒక మంచి హిట్ ఇచ్చారని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్.”
“ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ థాంక్యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు సినిమాకి ఒక యూనిక్ టోన్ ని సెట్ చేస్తూ డిఫరెంట్ సెట్స్ ని వేశారు. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారు సినిమాకి చాలా స్టైలిష్ కట్ ఇచ్చారు. మిక్కీ జే మేయర్ గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆడియన్స్ మ్యూజిక్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. డిఓపి షాను గారు అద్భుతమైన వర్క్ ఇచ్చారు ఆయనతో మళ్ళీ మళ్లీ కలిసి వర్క్ చేయాలనే ఉంది. ఈ సినిమాకి పని చేసిన అందరి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”
“శ్రీనిధి శెట్టి మృదుల క్యారెక్టర్ ని అద్భుతంగా చేసింది. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ చేసింది. ఎక్కడ కూడా డూప్ వాడలేదు. నాని గారితో జర్నీ స్టార్ట్ అయినప్పుడు నేను కొంచెం భయపడ్డాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన వ్యక్తితో జర్నీ చేసినప్పుడు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వాలని ప్రతి రోజు హార్డ్ వర్క్ చేస్తూ ఈ జర్నీ సాగింది. ఈరోజు ఈ సక్సెస్ మీట్ లో నాని గారిని ఇంత రిలాక్స్ గా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.”
“ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను. నాని గారితో ‘ఐయాం ప్రౌడ్ అఫ్ యు శైలేష్’ అనిపించుకోవడం గ్రేట్ మూమెంట్. ఆయన నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. రాజమౌళి గారికి థాంక్యూ. హిట్ ఫ్రాంచైజీ పై ఆయన ప్రేమ ఎప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: