లండన్‌లో చిరు, చరణ్ లతో ఫ్యాన్స్ సెల్ఫీలు

Megastar Chiranjeevi and Global Star Ram Charan Meets Fans in London

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లను కలిసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారు ఎక్కడ కనిపించినా కలిసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే. ఇందులో వింత ఏముంది అంటారా? అయితే ఇది జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లోనో.. లేదంటే ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కాదు.. లండన్‌లో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిరంజీవి, రామ్ చరణ్ ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో చరణ్ మైనపు బొమ్మను ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఫ్యామిలీతో సహా వారు లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోలను చూసేందుకు, వారితో కరచాలనం చేసేందుకు, ఆటోగ్రాఫ్స్ తీసుకునేందుకు మరియు సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపించారు.

కాగా చరణ్‌తోపాటు ఆయనకు ఎంతో ప్రియమైన పెంపుడు శునకం ‘రైమీ’ యొక్క మైనపు ప్రతిమను కూడా ఏర్పాటుచేయడం విశేషం. ఈ మ్యూజియంలో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత, ఒక పెంపుడు జంతువుతో కలిసి విగ్రహం కలిగిఉన్న ఏకైక సెలబ్రిటీ రామ్ చరణ్ కావడం విశేషం. ఇక టుస్సాడ్స్ మ్యూజియం, ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన సెలబ్రిటీల మైనపు బొమ్మలను గత కొన్నేళ్లుగా పలు దేశాల్లోని తమ మ్యూజియమ్స్‌లో ఏర్పాటు చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.