సింగిల్ చూసి మీరు 100% సాటిస్ఫై అవుతారు

Single Movie Will Satisfy Audience 100 Percent, Says Hero Sree Vishnu

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. అందాల భామలు కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ నిన్న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హీరో, హీరోయిన్స్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.

ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. అరవింద్ గారు చెప్పినట్టు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి చేసాం. మార్నింగ్ నుంచి ప్రతి ఏరియా నుంచి చాలా అద్భుతమైన కాల్స్ వస్తున్నాయి. థియేటర్లో పగలబడి నవ్వుతున్నామని ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందర్నీ నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీయడం జరిగింది.”

“ఫ్యామిలీతో కలిసి థియేటర్ కి రండి. మిమ్మల్ని నవ్వించే బాధ్యత నాది. 100% మీరు సాటిస్ఫై అవుతారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, గీతా ఆర్ట్స్ టీం అంతా చాలా సపోర్ట్ చేసింది. ఇవానా, కేతిక చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. భాను నందు మా కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అయింది. మేము ఊహించిందని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి మీ అమూల్యమైన రెండు గంటలు మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. థాంక్యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.