భైరవం రిలీజ్ డేట్ ఫిక్స్

Bhairavam Release Date Announced

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ ‘భైరవం’. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇంకా ఫస్ట్ సింగిల్ ‘ఓ వెన్నెల’, థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే రీసెంట్‌గా రిలీజ్ చేసిన మూవీ టీజర్‌ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల అదిరిపోయే బీజీఎమ్ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం.

భైరవం చిత్రాన్ని మే 30న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి పేరొందిన సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.