యంగ్ హీరో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మరో మూడు వారాల్లో థియేటర్లలోకి రానుంది.అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడంతో అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.ఈనేపథ్యంలో మేకర్స్ మరో సారి రిలీజ్ విషయంలో క్లారిటీఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు విజయ్ బర్త్ డే కావడంతో ఈ సందర్భంగా కింగ్డమ్ నుండి విజయ్ పోస్టర్ ను రిలీజ్ చేసి తనకు విషెష్ తెలిపింది టీం.ఇందులో రిలీజ్ డేట్ మే 30 అనే మెన్షన్ చేసింది.కానీ ఇంకా రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ కి పూర్తి నమ్మకం కలుగడం లేదు.మరి చెప్పినట్లు అదే డేట్ కి రిలీజ్ చేస్తారో లేదంటే వాయిదాపడుతుందో మరి కొన్ని రోజుల్లో ఫుల్ క్లారిటీ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల సినిమా ఆలస్యం అవుంతుందన్న టాక్ వినిపిస్తుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.
ఇక విజయ్ ప్రస్తుతం మరో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు.అందులో ఓ సినిమాను రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా తో చేయనున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నారు.అలాగే టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో ఓ కూడా విజయ్ సినిమా చేయనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈరెండు సినిమాలనుండి ఈ రోజు ప్రీ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























