రాబిన్ హుడ్ టీవీ ,ఓటిటిలోకి ఓకే రోజు

robinhood coming to ott and television on same day

భీష్మ తరువాత హీరో నితిన్ ,డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా రాబిన్ హుడ్.రీసెంట్ గా థియేటర్లలోకి రాగా అంచనాలను అందుకోలేకపోయింది. నితిన్ ఈసినిమాను చాలా కాన్ఫిడెన్స్ తో ప్రమోట్ చేశాడు. కానీ ఈసినిమా మాత్రం తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది. ఇక రాబిన్ హుడ్ ఓకే రోజున ఓటిటి అలాగే టీవీల్లోకి రానుంది.జీ తెలుగు శాటిలైట్ హక్కులు దక్కించుకోగా జీ 5 ఓటిటి రైట్స్ సొంతం చేసుకుంది. దాంతో రెండిట్లోకి ఓకే రోజున రానుంది.ఈనెల 10న జీ 5 లో స్ట్రీమింగ్ లోకి రానుండగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రీమియర్ పడనుంది.ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నాం కూడా ఇలాగే జరిగింది.ఓకే రోజు జీ 5 , జీ తెలుగులో ప్రసారం చేయగా రెండిట్లో మంచి వ్యూవర్ షిప్ వచ్చింది. ఇక ఇప్పుడు రాబిన్ హుడ్ కి కూడా అదే ఫాలో అవుతున్నారు.ఈసినిమాలో నితిన్ సరసన శ్రీ లీల నటించగా ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ లో కనిపించాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తరువాత నితిన్ తమ్ముడు తో రానున్నాడు.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతుంది.రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.జులై 4న ఈసినిమా విడుదలకానుంది.తమ్ముడుతో లయ రీ ఎంట్రీ ఇస్తుండగా సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈసినిమా కంప్లీట్ చేసి నితిన్ ఎల్లమ్మ సినిమాను మొదలు పెట్టనున్నాడు. బలగం వేణు ఎల్దండి ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో రానుంది.ఈసినిమాను కూడా దిల్ రాజే నిర్మించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.