మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించిన రీసెంట్ గా విడుదలై తుడరుమ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.లో హైప్ తో వచ్చిన ఈసినిమా కేవలం 6 రోజుల్లోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో ఈ ఫీట్ సాధించిన 11 వ మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.మోహన్ లాల్ కు ఇది నాలుగో 100కోట్ల సినిమా.ఇక కేరళ లో అయితే నిన్నటి తో 50కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఎల్ 2: ఎంపురాన్ తరువాత ఫాస్ట్ గా ఈ ఫీట్ సాధించిన రెండో సినిమాగా తుడరుమ్ రికార్డుల్లోకెక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా 8 రోజుల్లో ఈసినిమా 130 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో 200కోట్ల క్లబ్ లో చేరాలనే వుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈసినిమాలో శోభన ,థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి కీలక పాత్రల్లో నటించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.తెలుగులో కూడా ఈసినిమా రిలీజ్ అయ్యింది కానీ అనుకున్నంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేదు.
ఇక వరుస విజయాలతో మోహన్ లాల్ పీక్ ఫామ్ లో కొనసాగుతున్నాడు గత నెలలో ఎల్ 2: ఎంపురాన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా ఇక ఇప్పుడు నెల గ్యాప్ లో తుడరుమ్ తో సెకండ్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























