తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇప్పటికీ తమిళనాడులో డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది. ఈసినిమా నిన్నటి వరకు అక్కడ 150కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 250కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈనెల 8నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది సమాచారం.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వరుస పరాజయాల తరువాత అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ తో కం బ్యాక్ ఇచ్చాడు.కమర్షియల్ ఎంటర్టైనర్ గా అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో త్రిష కథానాయికగా నటించగా సునీల్ కీలక పాత్ర చేశాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.కోలీవుడ్ లో మైత్రికి ఇదే మొదటి సినిమా.
ఇదిలావుంటే ఓ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను అనౌన్స్ చేసే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ తరువాత మాత్రం ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు.అజిత్ నుండి ఇప్పుడప్పుడే నెక్స్ట్ సినిమాను అనౌన్స్ రాకపోవచ్చు.మరికొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నాడు.మరి అజిత్ నెక్స్ట్ ఏ దర్శకుడి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























