నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్: ది 3rd కేస్’. వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాని గ్రాండ్‌గా నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మే 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మావెరిక్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే హిట్ 1, హిట్ 2 చిత్రాలలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా హాజరయ్యారు. వీరితోపాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.
ఇక ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. “నేను అనుకున్నదానికన్నా నాని ఎంతో ఎత్తుకి ఎదిగాడు. ఇంకా మరింత గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నా. నాని నుంచి సినిమా వస్తుందంటే.. అది పక్కా హిట్టే అని ముందే అర్ధమైపోతుంది. హిట్ 3 కంటెంట్ చూస్తుంటే, కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందనిపిస్తుంది. ఇక ఫ్యూచర్‌లో నేను తీయబోయే ‘మహాభారతం’ చిత్రంలో నాని నటించడం పక్కా” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: