టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం (#BSS11) నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. దీనికి ‘కిష్కిందపురి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక రేపు ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో ఒకల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తోంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో హీరో, హీరోయిన్ టార్చ్ లైట్స్ పట్టుకుని ఒక పురాతన బంగ్లా ముందు నిలబడి దేనికోసమో వెతుకుతున్నట్టుగావుంది. పోస్టర్ అయితే అదిరిపోయింది, గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
కాగా మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సామ్ సీఎస్, చైతన్య భరద్వాజ్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో దీనిని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీ కాబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























