చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా ఇప్పటికే ‘శర్వా 36, శర్వా 37’ (నారీ నారీ నడుమ మురారి) ప్రాజెక్టులు సెట్స్‌పై ఉండగానే కొత్త సినిమా ‘శర్వా 38’ను ప్రకటించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో స్టార్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించనుంది. ఈ మేరకు నేడు వెల్లడించిన చిత్ర యూనిట్.. ఆమెను బోర్డులోకి స్వాగతించింది. అయితే అనౌన్స్మెంట్ పోస్టర్లో అనుపమ ఫేస్‌ను పూర్తిగా రివీల్ చేయలేదు. కాగా ఇంతకుముందు శర్వానంద్, అనుపమ జంటగా ‘శతమానం భవతి’లో నటించిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 30నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని సంపత్ నంది ఇదివరకే హింట్ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై అంతటా క్యూరియాసిటీ నెలకొంది. “భయం ప్రపంచాన్ని హింసతో రౌండప్ చేసినప్పుడు.. కొత్త ప్రపంచాన్ని రూపొందించడానికి రక్తం ఆయుధంగా మారుతుంది..” అంటూ ఇచ్చిన ట్యాగ్‌లైన్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది.
కాగా శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అలాగే సినిమాటోగ్రఫర్‌గా రమేష్ కొత్తపల్లి, ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ కుమార్ మన్నే వ్యవహరిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు మరియు పనిచేయనున్న టెక్నిషియన్ల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























