నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.చాలా రోజుల తరువాత టాలీవుడ్ నుండి వస్తున్న పెద్ద సినిమా ఇదే. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.నాని ఈసినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు.పాన్ ఇండియా రిలీజ్ కావడంతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి తో కలిసి అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు. ఈసినిమాతో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రానున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగడంతో రిలీజ్ కు ముందే నిర్మాతలు గట్టెక్కారు.ఇక నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత హైయెస్ట్ 1 మిలియన్ డాలర్ మూవీస్ వున్న హీరో నానినే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిట్ 3 కూడా యూస్ఎస్ఏ లో సూపర్ గా స్టార్ట్ చేసింది.అడ్వాన్స్ సేల్స్ 115K మార్క్ క్రాస్ చేశాయి.హిట్ టాక్ వస్తే ఈ సినిమా కూడా ఈజీగా మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేయనుంది.నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా వస్తుంది హిట్ 3.శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.నాని తోకలిసి ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తుంది.
ఇక ఈసినిమా రిలీజ్ తరువాత నాని ది ప్యారడైజ్ లో జాయిన్ కానున్నాడు.మే 2 నుండి ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుండగా నాని కొంచెం ఆలస్యంగా జాయిన్ కానున్నాడు.దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది మార్చి 26న విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: