మా అబ్బాయి రియాక్షన్‌కి షాక్ అయ్యాను – కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram Thanks Audience For Arjun SO Vyajayanthi Success

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రెస్ మీట్‌లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు, మా నందమూరి అభిమానులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఎక్స్ట్రార్డినరీ ఫీలింగ్. అమ్మ (విజయశాంతి)తో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.”

“ఈ చిత్రంలో శ్రీకాంత్ గారు కీలకమైన పాత్ర వేశారు. ఆ పాత్రకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతి క్రాఫ్ట్ గురించి ఆడియన్స్ పొగుడుతున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సునీల్ అశోక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అజినీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి జీవం పోసింది.”

“క్లైమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్. పొద్దున్నే మా అబ్బాయి సినిమా చూసి ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని చెప్పాడు. ఆ రియాక్షన్ కి నేను షాక్ కి గురయ్యాను. చాలా గర్వంగా ఉంది నాన్న అని చెప్పాడు. మదర్ సన్ మధ్య ఉన్న ఎమోషన్ కి ఆడియన్స్ అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ ప్రదీప్ గారు మొత్తం క్రెడిట్ కొట్టేశారు. ఆయన ఈ కథని నా దగ్గరికి తీసుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థాంక్ యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.