వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ లో నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ .తెలుగులో చాలా బ్లాక్ బస్టర్ తీసాము. ఈ సినిమాని రోహిణి థియేటర్స్ లో చూసాము. థియేటర్ ప్యాక్డ్ గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఆ విజువల్ ని మర్చిపోలేను. సినిమా హ్యుజ్ బ్లాక్ బస్టర్.”
“ఇదంతా మా హీరో అజిత్ గారి వలన. డైరెక్టర్ అధిక్ అద్భుతమైన సినిమా ఇచ్చాడు. అజిత్ గారు చాలా సింపుల్ పర్సన్. ఆయన మనసుతో మాట్లాడే మనిషి. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అధిక్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఈ సినిమాని 95 రోజుల్లో పూర్తి చేశాడు. ఇంత గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాని 95 డేస్ లో కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. అధిక్ లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి కావాలి.”
“జివి గారు, ప్రియా, కార్తీక్ అందరికీ థాంక్యు. సునీల్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఈ సినిమా రెండు గంటల రోలర్ కోస్టర్ రైడ్. ఎక్కడ ఆగదు. పరిగెడుతూనే ఉంటుంది. తమిళనాడు ఆంధ్ర,తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ అన్నిచోట్ల సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు. చాలా పెద్ద విజయం సాధించబోతుంది. అజిత్ గారికి టీమ్ అందరికీ మరోసారి థాంక్యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: