కుబేర ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

Kuberaa First Single Update

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ ‘కుబేర’. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈరోజు తమిళ నూత్న సంవత్సరం సందర్భంగా ఈ పాట రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 20న కుబేర ఫస్ట్ సింగిల్ విడుదలకానున్నట్టు తెలిపారు. అలాగే దీనికి సంబంధించి ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. కాగా డిఫరెంట్ కాంబోలో తెరకెక్కుతోన్న ఏ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా శేకర్ కమ్ముల రెగ్యులర్ స్టైల్‌కి భిన్నంగా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.