బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ జాట్ బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటుంది.మొదటి రోజు ఈసినిమా 11 కోట్లకుపైగా రాబట్టగా నిన్న 9కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో రెండు రోజుల్లో ఈసినిమా 20 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.అయితే వీకెండ్ కావడంతో ఈరోజు బుకింగ్స్ బాగున్నాయి.రెండో రోజు కన్నాఈ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.సోమవారం కూడా హాలిడే కావడం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జాట్ 5రోజుల్లో 50 కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.అయితే సన్నీ డియోల్ గదర్ 2 మొదటి రోజే 40 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో పోలిస్తే జాట్ చాలా వెనకబడినట్లే.ఇక ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను చేరుకోవాలంటే 150కోట్ల పైనే రాబట్టాల్సివుంది.మరి ఫుల్ రన్ లో ఆ మార్క్ ను అందుకుంటుందో చూడాలి.
టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రణదీప్ హూడా విలన్ పాత్రలో కనిపించగా రెజీనా కసాండ్రా ,సయామి ఖేర్, రమ్యకృష్ణ ,జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.ఇక ఈసినిమాను తెలుగులో విడుదలచేయడానికి మేకర్స్ ఇంట్రస్ట్ చూపించడం లేదు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























