రివ్యూ: జాక్

Siddu Jonnalagadda's JACK Movie Review

నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్ర‌కాష్ రాజ్‌, రాహుల్ దేవ్, నరేష్‌, బ్ర‌హ్మాజీ, సుబ్బరాజు తదితరులు
సంగీతం: సామ్ సీఎస్, అచ్చు రాజ‌మ‌ణి, సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్ర‌ఫీ: విజయ్ కె. చక్రవర్తి
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాణం: శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌
నిర్మాత: బివిఎస్ఎన్ ప్ర‌సాద్
దర్శకత్వం: బొమ్మ‌రిల్లు భాస్కర్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘జాక్’. కొంచెం క్రాక్‌ అనేది ట్యాగ్ లైన్. బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో న్యూ ఏజ్డ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌, ట్రైలర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ కేవలం 2 గంటల 10 నిమిషాల రన్ టైంతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది జాక్.

అయితే ‘డీజే టిల్లు’ ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత చేసిన ఈ మూవీతో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హ్యాట్రిక్ అందుకోగలిగాడా? తన డైలాగ్ డెలివరీ, స్వాగ్‍తో ఆడియెన్స్‌ని మెప్పించాడా? సిద్దు-వైష్ణవి జోడీ ప్రేక్షకులను అలరించిందా? అలాగే ఎంతోకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:-

కథానాయకుడైన పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) చదువులో టాపర్. సాధారణ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపడు. ఈ క్రమంలో హీరోయిన్ (వైష్ణవి చైతన్య)తో ప్రేమలో పడతాడు. దేశానికి సేవ చేయడానికి కేంద్ర నిఘా సంస్థ RAW (రీసెర్చ్ అనాలిసిస్ వింగ్)లో ఏజెంట్ కావాలని కోరుకుంటాడు. ఇందుకు సంబంధించి ఇంటర్వ్యూకు హాజరవుతాడు.

అయితే ఏజెన్సీ ఇంటర్వ్యూ ఫలితాలను ప్రకటించకముందే, జాక్ మరొక ఏజెంట్‌తో కలిసి ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఒక మిషన్‌ను ప్రారంభిస్తాడు. మరోవైపు అదే ఉగ్రవాదిని పట్టుకోవడానికి అప్పటికే పని చేస్తున్న సీనియర్ RAW ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో జాక్ కి, ఇతర ఏజెంట్లకు మధ్య ఎలాంటి క్లాషెస్ వచ్చాయి? మధ్యలో జాక్ లవ్ స్టోరీ ఏంటి? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:-

ఈ మధ్య ఇలాంటి జానర్ లో అడపాదడపా సినిమాలు వస్తున్నాయి. దర్శకుడు బొమ్మ‌రిల్లు భాస్కర్ దీనిని సీరియస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరక్కించాడు. అయితే దీనికి సిద్దు జొన్నలగడ్డ తనదైన నటనతో కామెడీ యాడ్ చేసి రక్తి కట్టించాడు. సినిమా ఆరంభంలోనే నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయారు దర్శకుడు. ఇక అక్కడినుంచి ప్రతి సన్నివేశం వేగంగా సాగుతూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఫస్టాఫ్ లవ్ ట్రాక్ ఎక్కువగా అలరిస్తే, సెకండాఫ్ యాక్షన్ వైపుకి టర్న్ తీసుకుంటుంది. క్లైమాక్స్ ఊహించేలావున్నా మెప్పిస్తుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే సిద్ధు జొన్నలగడ్డ దీనికిముందు చేసిన టిల్లు స్క్వేర్‌ తరహా నటనను ఇందులోనూ కొనసాగించాడు. తనదైన డైలాగ్ డెలివరీ, డిఫరెంట్ మ్యానరిజంతో నవ్వులు పూయించాడు. అలాగే యాక్షన్ సన్నివేశాలలో కూడా సిద్దు తన మార్క్ చూపించాడు. సిద్ధు, వైష్ణవి చైతన్య జంట మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్‌కి కనువిందు చేస్తుంది. రాహుల్ దేవ్ విలన్ పాత్రలో మెప్పించాడు. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ మరియు సుబ్బరాజు తదితరులు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.

ఇక టెక్నిషియన్స్ విషయానికొస్తే.. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు మ్యూజిక్ అందించడం విశేషం. అచ్చు రాజమణి, సామ్ సి.ఎస్. మరియు సురేష్ బొబ్బిలి సంయుక్తంగా సంగీతం సమకూర్చారు. పాటలు, నేపథ్య సంగీతం రెండూ డీసెంట్‌గా వున్నాయి. విజయ్ సి చక్రవర్తి సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్. నవీన్ నూలి ఎడిటింగ్ గురించి చెప్పాల్సినపనిలేదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

మొత్తం మీద, జాక్ సినిమా అన్ని విధాలుగా అలరించేలావుంది. సిద్ధు జొన్నలగడ్డ ఉన్నంతసేపూ హిలేరియస్‌గా వుంటుంది. కథ సీరియస్‌గా సాగిపోతున్న టైమ్ లోనూ తన డైలాగ్ డెలివరీతో నవ్వులు పూయించాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల రేంజ్‌లో కాకపోయినా జాక్ డీసెంట్‌గా ఉంది. మంచి టైమ్ పాస్ మూవీ అని చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.