తండేల్ తో ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నాగ చైతన్య కు అవసరమైన విజయాన్ని అందించింది.అంతేకాదు ఇందులో చైతన్య నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.వాస్తవిక సంఘటనల ఆధారంగా చందూ మొండేటి ఈసినిమాను తెరకెక్కించగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చైతన్య నెక్స్ట్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు.విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గా నాలుగు రోజుల షెడ్యూల్ జరుగగా నెక్స్ట్ ఈనెల 14 నుండి మొదలుకానుంది.దాదాపు 15 రోజుల పాటు జరుగనుంది.ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారు.ఈసినిమాకు హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.
చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈఏడాది లో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: