పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ గత కొన్నేళ్లుగా వరుసగా యాక్షన్ ఎంటర్‌టైనర్సే చేస్తున్నాడు. బాహుబలి 1&2, సాహో, సలార్, కల్కి 2898 AD చిత్రాలన్నీ ఆయన హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశాయి. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా ఆయన ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ చేయని డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. కాగా ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ మరియు స్పెషల్ మోషన్ పోస్టర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ గురించి డార్లింగ్ అభిమానులు, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దీనిగురించి పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో టీమ్‌ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి ఈ విషయంపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఇలా తెలిపారు.. “ఆ పని గురించి పీపుల్‌మీడియా ఫ్యాక్టరీకి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడానికి. ధృవీకరించబడిన తర్వాత CG విడుదల త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాము, నిర్మాతలు విడుదల తేదీని ప్రకటిస్తారు, ఈ ప్రక్రియలో అనేక బాహ్య విషయాలు ఉంటాయి, ఇది ఒక వ్యక్తి మాట లేదా పని కాదు కాబట్టి విషయాలు సమయం పడుతుంది, ఓపికగా ఉండండి, ప్రతి ఒక్కరూ మీ అంచనాలకు తగ్గట్టుగా తమ వంతు కృషి చేస్తున్నారు.” అని పార్కోన్నారు.
ఇక మరోవైపు ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ నెక్స్ట్ మూవీ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యింది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ రీసెంట్‌గా తమిళనాడులో జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోషల్ మీడియా సంచలనం ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: