నారీ నారీ నడుమ మురారి నుండి ‘దర్శనమే’ సాంగ్ ప్రోమో రిలీజ్

Darsanamey Song Promo Released From Nari Nari Naduma Murari

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రధాన నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. చాలావరకు టాకీ పార్ట్ పూర్తయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. ‘దర్శనమే’ అంటూ సాగే ఈ పాట ప్రోమోను నేడు రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఫుల్ సాంగ్‌ను ఈనెల 9న విడుదలచేయనున్నారు.

ఇక ఈ చిత్రాన్ని యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు. శర్వా37వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాను అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భాను బోగవరపు కథను అందించగా, నందు సావిరిగణ సంభాషణలను రాస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. ఇక జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా తెరకెక్కుతోన్న నారీ నారీ నడుమ మురారి సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.