విశ్వంభరతో నా కల నెరవేరింది – నటుడు ప్రవీణ్

Actor Praveen Excited on Sharing Screen With Megastar Chiranjeevi in Vishwambhara

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ త‌రం న‌టులు, ద‌ర్శ‌కులు, టెక్నిషియ‌న్స్‌లో చాలా శాతం మంది అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అన‌డంలో అతిశ‌యెక్తి లేదు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ‘కొత్త‌ బంగారులొకం’ చిత్రం నుండి కొత్త టాలెంట్ ఆర్టిస్ట్‌గా ప్ర‌వీణ్ త‌న న‌ట జీవితాన్ని మెద‌లుపెట్టారు.. ఆ చిత్రం త‌రువాత చాలా చిత్రాల్లో గోదారి సాంగ్‌తో కామెడీ చేసి తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ద‌ర్శ‌కుడు మారుతి దర్శ‌క‌త్వంలో ‘ప్రేమ క‌థా చిత్ర‌మ్’లో మ‌రొక్క సారి ప్రేక్ష‌కుల్ని త‌న న‌ట‌న‌తో త‌న టైమింగ్ కామెడీతో న‌వ్వించాడు. అంతేకాదు దాదాపు ప్ర‌తి చిత్రం విభిన్న పాత్ర‌లు చేసి ప్రేక్ష‌కుల్ని మెప్పించాడు. అయితే ప్ర‌వీణ్ స్వ‌త‌హాగా మెగాస్టార్ అభిమాని. కానీ మెగాస్టార్‌తో ‘ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య’ సినిమాలలో నటించినా ఆశించినంత స్కీన్ స్పేస్ రాలేదు.

ఇక రీసెంట్‌గా ఎవరూ ఊహించని విధంగా ‘విశ్వంభ‌ర’ చిత్రంలో దాదాపు మెగాస్టార్‌తో ఎక్కువ స్కీన్ స్పేస్ పంచుకుని అవకాశం దక్కింది. దానికి ప్ర‌వీణ్ ఆనందానికి అవ‌ధులు లేవు. అంతేకాదు మెగాస్టార్‌తో త‌న అభిమాన ముచ్చ‌ట్లు షాట్ గ్యాప్‌లో పంచుకున్నానని, ఆయ‌న‌తో యాక్ట్ చేయ‌డం అంటే అది త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపాడు. కేవ‌లం న‌టించే అవ‌కాశమే కాదు, ఆయ‌న‌తొ కామెడీ చేసే ఛాన్స్ వ‌చ్చింద‌ని రేపు ధియేట‌ర్స్‌లో ఆ కామెడి చూసి ప్రేక్ష‌కులు న‌వ్వుకుంటార‌ని ప్రవీణ్ తెలిపాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.