మలయాళ సినిమా L 2: ఎంపురాన్ మాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.కేరళ లో అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన మొదటి సినిమాగా ఘనత సాధించింది.కేవలం ప్రీ బుకింగ్స్ తోనే ఈ రికార్డు క్రియేట్ చేసింది.నిన్నటి వరకు అక్కడ 12.10 కోట్ల ప్రీ సేల్స్ జరిగాయి.ఇంతకుముందు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో 12 కోట్ల ఓపెనింగ్ తో కేరళ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో ఉండేది.ఇక ఇప్పుడు ఎల్ 2: ఎంపురాన్ ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.కేరళ లో మొదటి రోజు 15 కోట్లకు పైగా రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక భారీ అంచనాల మధ్య ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈసినిమాకు రివ్యూస్ పాజిటివ్ గా వస్తున్నాయి. దాంతో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించనుంది. తెలుగులో ఈసినిమాను దిల్ రాజు విడుదలచేశారు.ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. అయితే రేపు మ్యాడ్ స్క్వేర్ , రాబిన్ హుడ్ విడుదలకానుండడంతో ఎల్2: ఎంపురాన్ కి గట్టి పోటీ ఎదురుకానుంది.
బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమాలో మోహన్ లాల్ ,పృథ్వీరాజ్ సుకుమారన్,టొవినో థామస్ ,మంజూ వారియర్ కీలక పాత్రల్లో నటించగా పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్ట్ చేశాడు.దీపక్ దేవ్ సంగీతం అందించగా ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ , గోకులం మూవీస్ నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























