టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇదేక్రమంలో నేడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్ జాట్ మరో కీలక అప్‌డేట్ అందించింది. ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తోన్న రెజీనా కసాండ్రా మరియు సయామి ఖేర్ ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసింది.
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుస్తుండగా.. రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. కాగా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 10న హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: