రివ్యూ: దిల్ రుబా

Kiran Abbavaram's Dilruba Movie Telugu Review

నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, క్యాథీ డేవిసన్, సత్య, దయానంద్ రెడ్డి, జాన్ విజయ్ తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
సినిమాటోగ్ర‌ఫీ: డేనియల్ విశ్వాస్
ఎడిటింగ్: ప్రవీణ్ కెఎల్
నిర్మాణం: శివమ్ సెల్యులాయిడ్స్, యూడ్లీ ఫిలిమ్స్
నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ సినిమాస్
దర్శకత్వం: విశ్వ కరుణ్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే ‘క’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీనితర్వాత ఇప్పుడు ‘దిల్‌రూబా’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న పెయిడ్ ప్రీమియర్స్ వేసి మూవీపై కాన్ఫిడెన్స్ చూపించాడు. మరోవైపు మేకర్స్ కూడా దిల్‌రూబా సక్సెస్‌పై మంచి నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం నేడు థియేటర్లలోకి వచ్చింది.

అయితే న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? క తర్వాత కిరణ్ అబ్బవరం మరోసారి హిట్ అందుకోగలిగాడా? ఇంతకుముందు సాఫ్ట్ క్యారెక్టర్స్‌లో కనిపించిన కిరణ్, దిల్‌రూబాతో కొత్తగా మాస్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేశాడా? ఇందులో ఎంతవరకూ ఆయన సక్సెస్ అయ్యాడు? ఇంతకూ ఈ చిత్రం విజయం సాధించిందా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:-

కథానాయకుడైన సిద్ధూ అలియాస్ సిద్దార్థ్ (కిరణ్ అబ్బవరం) ప్రేమలో విఫలమవుతాడు. అనుకోని కారణాలతో మ్యాగీ అలియాస్ మేఘన (ఖ్యాతి డేవిసన్) అతడికి బ్రేకప్ చెబుతుంది. ఈ రెండు ఘటనలు సిద్దు జీవితంపై పెను ప్రభావం చూపిస్తాయి. దీంతో అతను ఈ ఎమోష‌న్స్ కి దూరం అవుతాడు. సారీ, థ్యాంక్స్.. అనే ఈ రెండు ప‌దాల‌కు అంతగా విలువ ఇవ్వ‌డు. ఇక కొడుకు బాధ చూడలేక దూరంగా మంగుళూరు పంపిస్తుంది సిద్దు తల్లి.

ఈ తరుణంలో సిద్దార్థ్ జీవితంలోకి అంజ‌లి (రుక్సార్ థిల్లాన్‌) వ‌స్తుంది. అక్కడ కాలేజీలో క్లాస్ మేట్ అయిన అంజలి తొలిచూపులోనే సిద్ధుని చూసి ఇష్టపడుతుంది. దీంతో తనని ప్రేమించ‌మ‌ని అతడి వెంట ప‌డుతుంది. సిద్దార్థ్ కూడా మ్యాగీని మ‌ర్చిపోయి అంజ‌లి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల వీరిద్దరూ కూడా విడిపోతారు. మరోవైపు విషయం తెలుసుకున్న మ్యాగీ వీరిద్ద‌రి క‌ల‌ప‌డం కోసం అమెరికా నుంచి తిరిగి వ‌స్తుంది.

అంజ‌లి, సిద్దార్థ్ మధ్య గొడ‌వేంటి? వాళ్లిద్దరి మధ్య ఎందుకు బ్రేకప్ జరిగింది? సిద్ధూతో బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైన మ్యాగీ మళ్లీ ఇండియా ఎందుకు వచ్చింది? మధ్యలో డ్రగ్, మాఫియా డాన్ జోకర్ (జాన్ విజయ్) ఎవరు? అంజలితో పాటు మ్యాగీని అతడు ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఎలాంటి పరిస్థితి ఎదురైనా థాంక్స్, సారీ చెప్పని సిద్ధూ చివరకు తన ప్రేమ కోసం దిగివచ్చాడా? అనేదే ‘దిల్ రూబా’ సినిమా.

విశ్లేషణ:-

కథగా చూస్తే.. దిల్‌రూబా రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీయే. అయితే దీని ట్రీట్‌మెంటే డిఫరెంట్‌గా అనిపిస్తుంది. డైరెక్టర్ విశ్వ కరుణ్ ఈ విషయంలో జాగ్రత్త పడ్డాడు. లవ్ సీన్స్‌లో కొత్తదనంతో పాటు బిగువైన స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా మలిచాడు. ఫస్టాఫ్ అంతా ప్రధానపాత్రల మధ్య ప్రేమ సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిపోతుంది. కాలేజీ గొడ‌వ‌లు, బైక్‌ త‌గ‌ల‌బెట్టేయ‌డం వంటి సీన్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అయితే ఊహించని ఇన్సిడెంట్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

దీంతో సెకండాఫ్‌పై ఆసక్తి క్రియేట్ అవుతుంది. ఎక్స్ లవర్ అమెరికానుంచి తిరిగిరావడం, మాఫియా డాన్ వీళ్ళ జీవితాల్లోకి రావడం కీలక మలుపు. అందుకు తగ్గట్టే మలిభాగంలో స్టోరీ యాక్షన్ వైపుకు టర్న్ తీసుకుంటుంది. ఈ సన్నివేశాల్లో కిరణ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా సత్య కామెడీ టైమింగ్ అలరిస్తుంది. అయితే క్లైమాక్స్‌ ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగానే ఉన్నా ఇంట్రెస్టింగ్‌గా తీర్చిదిద్దారు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. కిరణ్ అబ్బవరం మంచి నటుడని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. తనకి నప్పే కథలను ఎంచుకుంటూ, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనికిముందు ఆయన నటించిన ‘క’ సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అయితే, దిల్‌రూబా కంప్లీట్ హీరో ఓరియెంటెడ్ మూవీ. ఒకవైపు లవర్ బాయ్‌గా కనిపిస్తూనే మరోవైపు ఫుల్ యాక్షన్ కూడా చూపించేశాడు. సినిమాలో కిరణ్ అబ్బవరం స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. మాస్ ఇమేజ్ కోసం ఆయన చేసిన ప్రయత్నం మంచి రిజల్టే అందించనుంది.

అలాగే హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ ఇందులో గ్లామర్ రోల్ పోషించింది. అంజలి పాత్రలో ఆకట్టుకునే అభినయం ప్రదర్శించింది. మరో కథానాయికగా నటించిన క్యాథీ డేవిసన్ కూడా అందంగా కనిపించింది. తన పాత్రకు తగినంత స్పేస్ లేనప్పటికీ ఉన్నంతలో పర్వాలేదనిపించేలావుంది. సత్య కామెడీ అలరిస్తుంది. ఇంకా దయానంద్ రెడ్డి, జాన్ విజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.

ఇక టెక్నిక‌ల్‌ విషయానికొస్తే.. సామ్ సీఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో బీజీఎమ్ బావున్నాయి. డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకు మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది. అలాగే ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. ఇంకా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉండి నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.

ఓవరాల్‌గా చూస్తే, దిల్‌రూబా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని చెప్పొచ్చు. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. రెండున్నర గంటలు మంచి టైమ్ పాస్ మూవీగా నిలుస్తుంది. అలాగే హీరో కిరణ్ అబ్బవరానికి కూడా క తర్వాత మళ్ళీ హిట్ బొమ్మ పడ్డట్టే అని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్టులపై భారీ అంచనాలే ఉంటాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.