బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దసరా’తో గ్రాండ్ గా అరంగేట్రం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.దసరాకు అనేక అవార్డులు అందుకున్న శ్రీకాంత్ ఓదెల, ది ప్యారడైజ్ చిత్రానికి సంబందించి ‘రా స్టేట్‌మెంట్’తో ప్రశంసలు అందుకున్నారు. ఇక త్వరలోనే ఆయన తన మూడవ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయనుండటం గమనార్హం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. దీనిలో భాగంగా ఆయన ‘సమ్మక్క సారక్క క్రియేషన్స్’ పేరుతో సొంత బ్యానర్ ప్రారంభించారు. సినిమా రంగంలో అద్భుతమైన అభిరుచి గల చిత్రాలకు పేరుగాంచిన ‘చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్’కు చెందిన అనురాగ్ రెడ్డి మరియు శరత్ చంద్రలను నిర్మాణ భాగస్వాములుగా చేస్తూ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి కథను కూడా అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన తాజాగా తమ కొత్త చిత్రం టైటిల్ “AI అమీనా జరియా రుక్సానా గులాబీ” అని ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి నూతన దర్శకుడు చేతన్ బండి రచన మరియు దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ అద్భుతమైన పోస్టర్‌లో నల్లటి చీరలో ఒక అమ్మాయి సరిహద్దు వెంట నడుస్తూ, ఎర్ర గులాబీలు చెల్లాచెదురుగా పడి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
“AI అమీనా జరియా రుక్సానా గులాబీ” అనేది 2009లో గోదావరిఖని అనే బొగ్గు పట్టణం నేపథ్యంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఒక ప్రేమకథ. ఈ ప్రేమ గాథ ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించే అమ్మాయి యొక్క లోతైన భావోద్వేగాలను చిత్రీకరిస్తుంది. మొత్తానికి టైటిల్ మరియు ఆకర్షణీయమైన పోస్టర్ కలయిక ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ చిత్రంలో నటించనున్న ముఖ్య తారాగణం మరియు పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను రాబోయే రోజుల్లో, చిత్ర నిర్మాతలు వెల్లదించనున్నారు. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుదాం..
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: