నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రెజెంట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, అలానే ఫస్ట్ సింగిల్ ‘ప్రేమలో’ కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ప్రియదర్శి మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నారు.
‘కోర్ట్’ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది?
- 2022లో నేను, రామ జగదీష్ వేరే సినిమా చేస్తున్న టైం లో మండుటెండలో ఒక చెట్టు కింద కూర్చుని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం.
- ఈసారి కచ్చితంగా ఒక మంచి సినిమా చేయాలి అనుకుంటూ ఉన్న సమయంలో రామ్ జగదీష్ ఒక ఐడియా ఉంది అని చెప్పారు.
- సరే కథ రాసుకొని రమ్మని చెప్పాను. ఒక ఆరు నెలలకి కథ మొత్తం రాసుకుని తీసుకోవచ్చాడు.
- ఇలాంటి కథలు ఇప్పుడు ఎవరు చేస్తారు? అని అనుకుంటూ ఉన్న సమయంలోనే ఇది గనుక హిట్ అయితే ప్రేక్షకులకు గుర్తుండిపోయి సినిమా అవుతుంది అని గట్టి నమ్మకం కలిగింది.
- మళ్లీ నెక్స్ట్ సమ్మర్‌కి నాని అన్నతో గోవాలో ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తున్న టైం లో ఈ కథ గురించి చెప్పినప్పుడు నాని అన్న ఈ కథ వింటాను అని చెప్పారు.
- తరువాత నాని గారు కథ విన్నారు, ఈ కథ మనం చేస్తున్నాం అని చెప్పారు. అలా స్టార్ట్ అయింది ఈ స్టోరీ.
లాయర్ పాత్రలో మొదట మిమ్మల్ని అనుకున్నారా?
- ఈ కథ చెప్పినప్పుడు అలానే రాసేటప్పుడు ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నా డు రామ జగదీష్.
- కానీ నేను ఈ క్యారెక్టర్ చేస్తానని బ్రతిమిలాడాను.
- సరే అని ఒప్పుకొని నాని గారి దగ్గరికి వెళ్లి చెప్పినప్పుడు అన్న కూడా అదే అన్నాడు.
ఇలాంటి కథలు బాలీవుడ్‌లో ఎక్కువగా వస్తూ వుంటాయి, ఈ సినిమాలో ఎంతవరకు చట్టాలను అర్థమయ్యేలా చూపించగలిగారు? క్యారక్టర్‌కి ఎంత హోం వర్క్ చేశారు?
- ప్రతి కోర్టు రూమ్ డ్రామాలో ముఖ్యంగా మనకి ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్ అలానే వాటికి అమలు అయ్యే చట్టాలు ఇవన్నీ కూడా మనకి కొంతమేరకు తెలియాలి.
- అలానే కొంత మంది లాయర్లు దగ్గరికి వెళ్లి పోక్సో కేసు అంటే ఏమిటి? దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే అవగాహన ఉండాలి.
- అలానే కొంతమంది జడ్జెస్ దగ్గరనుంచి కొన్ని జడ్జిమెంట్ స్వీకరించి వాటి నుంచి ఒక మెటీరియల్ తయారు చేశాడు రామ్ జగదీష్. అవి నాకు కూడా ఇచ్చాడు.
- నేను కూడా రియల్‌గా కోర్టులో లాయర్లు, జడ్జీలు ఎలా ఉంటారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వారి భాష ఇలా ప్రతి ఒక్కటి చూసి ఎగ్జాక్ట్‌ట్‌గా అలా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం.
- సెక్షన్లు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాను.
- విజయవాడలో ఉన్న కొన్ని జిల్లా కోర్టులకు వెళ్లి అక్కడ ఎలా ఉంటుంది? అని చూసి మక్కి టు మక్కి విటల్ గారు దించేశారు.
- అదేవిధంగా పోక్సో కోర్టు కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.
- 2024 ముందు ఎలా ఉండేదో ఇంచుమించుగా అలాగే ఉండేలా జాగ్రత్తగా తీసుకున్నారు డైరక్టర్.
- ప్రతి ఒక్కటి కూడా రియలిస్టిక్‌గా వుండేలా చూస్కున్నాం.
- జుడీషియరీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి దానికి డిస్ రెస్పెక్ట్ తీసుకురావాలి అని మేము అనుకోలేదు.
- ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు లాయర్లు మీద రెస్పెక్ట్ పెరిగింది.
- అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనకి ఎంతగా ఉపయోగపడుతుంది అని అర్థం అయింది.
‘స్టేట్ vs ఏ నోబడి‘ క్యాప్షన్ పెట్టడానికి రీజన్ ఎంటి?
- ఒకడు దొంగతనం చేసి పోలీసులకు దొరికితే, పోలీసులు ఆ దొంగ నేరస్తుడు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం వుంది.
- అపుడు మనం కోర్టు భాషలో చెప్పాలి అంటే.. స్టేట్ vs అక్యూసెడ్ అని అంటాం.
- చట్టానికి అందరూ ఒకటే అనే సైన్‌తో అలా పెట్టాం.
సినిమాని లాయర్లకు చూపించరా?
- ఎస్, కొంత మంది లాయర్లకు, అలానే బార్ కౌన్సిల్ వారికి చూపిద్దాం అనుకుంటున్నాం.
- కొంత మంది బార్ కౌన్సిల్ మెంబెర్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
- అలానే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా కలిసి ఇన్‌వైట్ చేద్దాం అనుకుంటున్నాం.
- పుష్ప 2 టైం జరిగిన ఇన్సిడెంట్ గురించి చూసుకుంటే కోర్టులో ఎలాంటి సిట్యువేషన్స్ జరిగాయో చూసాం.
- నిరంజన్ రెడ్డి గారు వాడిన బాష ఇలాంటివి అన్ని చూసి డబ్బింగ్‌లో కూడా కొన్ని మార్పులు చేశాం.
నాని గారు ఈ సినిమా చూడండి నచ్చకపోతే నా సినిమా కూడా చూడటం మానేయండి అని అన్నారు దాని మీద మీ ఒపీనియన్?
- అది ఆయనకు కథ మీద వున్న నమ్మకం.
- నాని గారు ఎంచుకునే కథలు కూడా అలానే వుంటాయి.
- నాని అన్న ఒక క్రెడిబుల్ అండ్ రిలయబుల్ యాక్టర్ స్క్రిప్ట్ చూజ్ చేసుకునే విషయంలో.
- అలాంటి వ్యక్తి కథ విన్నాక ‘మన దగ్గర ఒక గుడ్ కథ వుంది దానిని గ్రేట్ కథగా తీయాలి’ అని అన్నారు.
- అలానే ఆయన సినిమా చూసాక ‘నేను ఏదో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది’ అని అన్నారు.
డ్రీమ్ రోల్?
- బయోపిక్ చేయాలని వుంది.
- శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ కే ఐ వరప్రసాద్ గారి బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో వుంది.
- కోర్టు సినిమాకి పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ వస్తె నేను కమర్షియల్ హీరో అని అనుకుంటాను.
- మంచి సినిమాకి పైసలు వస్తే అది కమర్షియల్ హిట్.
- నాలాంటి నటులు మంచి కథలు చేస్తేనే థియేటర్ లకి జనాలు వస్తారు లేదంటే రారు.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్, ప్రొడ్యూసర్స్ గురించి ఎం చెప్తారు?
- ప్రశాంతి గారు, దీప్తి గారు మాకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.
- అవసరం అయిన అన్ని సమకూర్చారు. సెట్స్‌లో మాతో పాటు ఉండేవారు.
- నాని గారు మాత్రం అప్పుడప్పుడు రషెస్ చూసి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తూ ఉండే వారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
- ‘సారంగపాణి జాతకం’ ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది.
- ‘ప్రేమంటే’ చేస్తున్నాను.
- గీతా ఆర్ట్స్‌లో కూడా ఒక ఫిలిం సైన్ చేశాను.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























