సంక్రాంతికి వస్తున్నాం.. అదిరిపోయే రికార్డ్

Sankranthiki Vasthunam Completes 50 Days in 92 Centers

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ఇందులో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ నుండి ఈ సినిమాకు సూపర్ సపోర్ట్ లభించడంతో విడుదలైన ప్రతిచోటా సక్సెస్ ఫుల్‌ రన్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఏకంగా 300కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి ఆల్ టైం రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించింది.

ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం కొన్ని రోజుల క్రితం ఒకే సమయానికి టీవీ మరియు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఓటీటీ అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో ఈ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతుండగా.. మరోవైపు శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న ZEE తెలుగులో టెలికాస్ట్ అవుతోంది.

ఈ సందర్భంగా ఓటీటీ లోనూ ఈ సినిమా ప్రభంజనమే సృష్టించింది. కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ తో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఓటీటీ, టీవీ లలో అందుబాటులో ఉన్నా ఈ మూవీని థియేటర్లలో వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటం విశేషం.

ఇక ఇదిలావుంటే, తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మరో అద్భుతమైన రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో 92 కేంద్రాలలో 50 రోజులను పూర్తి చేసుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక సినిమా థియేటర్లలో 50 రోజులు ఆడటం అనేది ఊహకందనిది. ఎంత పెద్ద చిత్రమైనా థియేటర్లలో లైఫ్ టైమ్ రన్ 2 వారాలే. అలాంటిది ఈ సినిమా 50 రోజులు ఆడటం అంటే.. చాలా గొప్ప విషయంగా పరిగణిస్తున్నారు సినీ పండితులు. మొత్తానికి వెంకీ, అనిల్ రావిపూడి కాంబో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ అనిపించుకుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.