గుడ్ బ్యాడ్ అగ్లీ.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్

Ajith Kumar’s Good Bad Ugly Telugu Teaser Receiving Superb Response

ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ను తమ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో తెలుగు సినిమాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హై-ప్రొఫైల్ మూవీ ఇప్పటికే సంచలనం సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం తమిళ టీజర్ నిన్న విడుదలై 30 మిలియన్లకు పైగా వ్యూస్ తో అదరగొట్టింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇటీవలే తెలుగు టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ టీజర్ అజిత్‌ను నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అద్భుతంగా ప్రజెంట్ చేసింది. అతని పాత్ర ఎకె ‘ రెడ్ డ్రాగన్’ డెడ్లీ, వైలెన్స్ వరల్డ్ ని పరిచయం చేసింది.

“నువ్వు ఎంత మంచివాడివైనా, ప్రపంచం నిన్ను చెడుగా మార్చేస్తుంది” అనే ఈ డైలాగ్ యాక్షన్-ప్యాక్డ్ నెరెటివ్ కి టోన్ సెట్ చేసింది. AK తన నిజాయితీతో ఎంత పోరాడినా, అతని చుట్టూ ఉన్న శక్తులు అతన్ని చీకటి, ప్రమాదకరమైన ప్రపంచంలోకి నెట్టివేస్తాయని చూపిస్తుంది. టీజర్‌లో అద్భుతమైన విజువల్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ అజిత్ అభిమానులను కట్టిపడేశాయి. అజిత్ రెడ్ డ్రాగన్ క్యారెక్టరైజేషన్ మెస్మరైజ్ చేస్తోంది.

అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. GV ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం ఎక్సయిటమెంట్ ని మరింత పెంచుతుంది. అజిత్ క్యారెక్టర్ లో వైవిధ్యమైన కోణాలు అతని పాత్రను మరింత ఆసక్తిని రేపాయి. అద్భుతమైన యాక్షన్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో గుడ్ బ్యాడ్ అగ్లీ ఆడియన్స్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతుందని ఈ బ్లాస్టింగ్ టీజర్ ప్రామిస్ చేస్తోంది

ఇక ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ప్రభు తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇండియన్ సినిమాలో ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలుస్తుందని హామీ ఇచ్చింది. ఈ సినిమా ఎడిటింగ్‌ను విజయ్ వేలుకుట్టి నిర్వహించగా, జిఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. కాగా టీజర్ తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం ఏప్రిల్ 10న వేసవిలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.