యంగ్ హీరో సందీప్ కిషన్ మజాకా మరో 5రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన ఈసినిమాను డైరెక్ట్ చేయగా రీతూ వర్మ కథానాయికగా నటించింది.ఈసినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక నిన్న ఈసినిమా నుండి ఫోక్ సాంగ్ ను రిలీజ్ చేశారు.సొమ్మసిల్లి పోతున్నవే అంటూ సాగే ఈ సాంగ్ ఆల్రెడీ ప్రైవేట్ సాంగ్ గా వచ్చి యూట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యింది.ఇప్పుడదే సాంగ్ ను కొద్దిగా లిరిక్స్ మార్చి ఈసినిమాకు వాడుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫన్ &ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రావు రమేష్,మురళి శర్మ ,అన్షు కీలక పాత్రల్లో నటించారు.లియోన్ జేమ్స్ సంగీతం అందించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా ఈసినిమాను నిర్మించారు. ఇక మాజాకా సెన్సార్ కూడా జరిగిపోయింది. యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేయగా 2గంటల 29నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.
ఈసినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అవుతుందని సందీప్ కిషన్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపనున్నారు.అయితే ఇంకా ట్రైలర్ ను విడుదలచేయాల్సివుంది.ఇక ఈసినిమా థియేట్రికల్,నాన్ థియేట్రికల్ పరంగా సాలిడ్ బిజినెస్ చేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: