అనిల్ రావిపూడి చేతులమీదుగా.. శివంగి ఫస్ట్ లుక్ రిలీజ్

Director Anil Ravipudi Unveils Actress Anandhi First Look Poster From Shivangi

ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘శివంగి’. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నరేష్ బాబు పి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి చేతులమీదుగా ఫస్ట్ లుక్ లాంఛ్ చేశారు. ఈ సినిమా ఎంత పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో వుండబోతోందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతోంది.

నల్ల లుంగీ, చొక్కాతో కాళ్ళపై కాళ్ళు వేసుకొని సోఫాలో డైనమిక్‌గా కూర్చున్న ఆనంది లుక్ స్టన్నింగ్‌గా వుంది. ఇందులో ఆమెది ఫుల్ డామినేటింగ్ క్యారక్టర్ అని అర్ధమవుతోంది. ఫస్ట్ లుక్ అయితే సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. విమెన్ సెంట్రిక్ సినిమాలలో శివంగి గ్రౌండ్ బ్రేకింగ్ కథ స్క్రీన్ ప్లేతో వుండబోతోంది.

ఇక ఈ చిత్రానికి A.H కాషిఫ్ – ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తుండగా.. భరణి కె ధరన్ డివోపీగా, రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశారు మేకర్స్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.