బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ చిత్రంతో గతేడాది మంచి హిట్ అందుకున్నారు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయికగా నటించగా.. ఇమ్రాన్ హష్మి విలన్‍గా కనిపించారు. దేశభక్తి కథాంశంగా రూపొందిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టు కోసం దక్షిణాది డైరెక్టర్‌తో చేతులు కలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఆయన ‘సికందర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మంగళవారం చిత్ర నిర్మాత పుట్టిన రోజు సందర్భంగా ‘లిటిల్ గిఫ్ట్’ పేరుతో చిత్రబృందం సల్మాన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సల్మాన్‌ఖాన్ సరికొత్త లుక్‌లో కనిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్ అందింది.
హీరో సల్మాన్ ఖాన్ తన పాత్రకు సంబంధించి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేసారు. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ఈ నెల 27న టీజర్‌ను, మార్చి తొలి వారంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. కాగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రంజాన్ పర్వదినం సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ఈ మూవీని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సల్మాన్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాలు ‘కిక్’, ‘జుడ్వా’ సాజిద్ నిర్మించినవే. ఇక ‘కిక్’ సినిమాకు సాజిద్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మరో మూవీ చేయనుండటం.. దానికి ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ చేయనుండటంతో చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. దీనితో పాటుగా సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‍తో కలిసి ‘టైగర్ వర్సెస్ పఠాన్’ చిత్రంలోనూ నటించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: