మజాకా.. ఇది ఫస్ట్ టైం ఎవర్ లైవ్ షూట్

Mazaka Song The First Time Ever Live Shoot, Says Sundeep Kishan

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ హైలీ ఎంటర్‌టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ క్రియేటివ్ ప్రమోషన్స్‌తో ఆడియన్స్‌ని అలరించారు. షూటింగ్‌ని లైవ్‌ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. షూటింగ్‌ని లైవ్‌లో ఇవ్వడం ఇదే తొలిసారి. లైవ్ షూటింగ్ ద్వారా సినీ ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని అందించారు మజాకా మేకర్స్.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇంతదూరం వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేము క్రియేటివ్‌గా ప్రమోషన్స్ చేయాలని భావించాం. కానీ ఇంత ఎండలో చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడకి వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్ యూ. ఇది ఫస్ట్ ఎవర్ లైవ్ షూట్ ప్రెస్ మీట్ అని చెబుతుంటే నాకు చాలా సర్‌ప్రైజ్‌గా అనిపించింది. చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇది. వన్ మంత్‌గా డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 26న పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం వుంది. మీ అందరి సపోర్ట్ కావాలి” అని అన్నారు.

అలాగే చిత్ర దర్శకుడు త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ.. “మజాకాలో ఇది సెకండ్ మాస్ సాంగ్. మూడు రోజుల క్రితం భారీ సెట్‌లో ఓ సాంగ్ చిత్రీకరించాం. సందీప్ కిషన్, రీతూ వర్మ ఇరగదీశారు. దాదాపు డెబ్బైమంది డ్యాన్సర్స్‌తో భారీ సెట్స్‌లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ అద్భుతంగా షూట్ చేశాం. ఇప్పుడు కంప్లీట్ అవుట్ డోర్ లో చేస్తున్న రావులమ్మ ఇంకో మాస్ సాంగ్. ఫుల్ ఫోక్ సాంగ్. థియేటర్స్‌లో దద్దరిల్లిపోతుంది. ఈసారి మళ్ళీ సీట్లు లేస్తాయి. ఇది ఫిక్స్. సినిమా రీరికార్డింగ్ చూసేశాను. ఎక్స్ లెంట్‌గా వుంది. సందీప్ కిషన్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. మామూలుగా వుండదు” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.